Podharillu: ఘనంగా జరిగిన మహా, చక్రిల రిసెప్షన్!
on Feb 7, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు(Podharillu)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-45 లో.. రిసెప్షన్ కోసం అందరు వెయిట్ చేస్తుంటే అప్పుడే మహాలక్ష్మి బయటకి వస్తుంది. తర్వాత తనని చక్రిని స్టేజ్ మీదకి తీసుకెళ్ళమని చెప్తాడు నారాయణ. ఇక ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ వాళ్ళని ఫోటోలు తీస్తుంటాడు. ఇద్దరు భార్యాభర్తలే కదా దగ్గరికి జరగండి అని ఫోటోగ్రాఫర్ అనగానే మహాకి దగ్గరగా చక్రి కూర్చుంటాడు. దాంతో మహా కోపంగా చూస్తుంది. వెంటనే చక్రి దూరంగా కూర్చుంటాడు.
మేడమ్ మీరు దగ్గరగా కూర్చోండి అని ఫోటోగ్రాఫర్ అనగానే చక్రికి దగ్గరగా కూర్చుంటుంది మహా. ఇక ఫోటోలు తీయడం స్టార్ట్ చేస్తాడు. ఇక స్టేజ్ ముందున్న వారిని ఒక్కొక్కరిగా వచ్చి ఆశీర్వదించి వెళ్ళండి అని మాధవ చెప్తాడు. ఇక ఒక్కొక్కరు వచ్చి ఆశీర్వదించి వెళ్ళాక నారాయణ రెండు పూలదండలతో ఎంట్రీ ఇస్తాడు. అవి చూసి మాధవతో పాటు చక్రి, మహా షాక్ అవుతారు. ఇక రెండు పూలదండలు మార్చుకోమని నారాయణ అనగానే ఇవన్నీ నాకు ఇష్టం లేదు నేను వెళ్లిపోతానని మహా అనగానే మాధవ, చక్రి రిక్వెస్ట్ చేస్తారు. ఇక తప్పక దండలు మార్చుకుంటారు. ఆ తర్వాత తాళి బయటకు తీస్తాడు నారాయణ అది చూసి మహా, చక్రి, మాధవ షాక్ అవుతారు. తాళి కోడలి మెడలో వేయమని నారాయణ అంటాడు. స్టేజ్ ముందు అందరు ఉన్నారు. ఏమనుకోకండి అని చెప్పి మహా మెడలో తాళి వేస్తాడు చక్రి. ఇక అందరు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు.
ఇక మాధవ వాళ్ళ అత్త కుళ్ళుకుంటుంది. అందరు భోజనాలు చేస్తుంటారు. అప్పుడే చక్రి, మహాలతో కేశవ, కన్నా ఫోటో దిగాలని చెప్తారు. ఇక మాధవ, కేశవ, నారాయణ, చక్రి, మహా ఫోటోలు దిగుతుంటే అప్పుడే మాధవ మరదలు స్టేజ్ మీదకి వచ్చి ఫ్యామిలీ ఫోటో దిగుతుంది. ఆ తర్వాత తన మరదలిని తీసుకెళ్ళి భోజనం వడ్డిస్తాడు మాధవ. దాంతో తను ఎమోషనల్ అవుతుంది. ఇక కాసేపటికి మాధవ మేనత్త వచ్చి తన కూతరిని తిడుతుంది. నా మాట కాదని ఇక్కడికి వచ్చిందే కాకుండా భోజనం చేస్తావా అని తిడుతుంటే వాళ్ళ మామయ్యని చూపిస్తుంది. తాగుతున్న అతడిని చూసి ఆమె షాక్ అవుతుంది. ఇక వాళ్ళిద్దరిని తిట్టి మాధవ మేనత్త వెళ్ళిపోతుంది. ఇక మాధవ, చక్రి, మహా, కేశవ, కన్నా అందరు కలిసి భోజనం చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



